feedburner
Enter your email address:

Delivered by FeedBurner

feedburner count

Magadeera -2009 Short story type

Labels:


రాజరికాల నాటి కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతున్న రోజులవి. కింగ్ కాలభైరవను ఎలాగైనా అంతం చేసి అతని ప్రేమను భగ్నం చేసేందుకు అంతఃపురంలోనే కుట్రలు జరుగుతుంటాయి. కాలభైరవ సవతి సోదరుడే ఇందుకు సూత్రధారి. ఆ కుట్రకు గురై తమ ప్రేమను పండించుకోలేక పోయిన కాలభైరవ, అతని ప్రియురాలైన ప్రిన్స్ మరో జన్మ ఎత్తుతారు. కాలభైరవ ఒక స్టంట్ మన్ గా, ప్రిన్స్ ఓ ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటూ తిరిగి కలుస్తారు. ఆ కాలంలో ఈ ఇద్దరి ప్రేమ జంటను విడిదీసిన సవతి సోదరుడే ఈ జన్మలో వారిద్దరినీ కలుపుతాడు. కాలభైరవగా-స్టంట్ మన్ గా రామ్ చరణ్, ప్రిన్స్ గా-ఫ్యాషన్ డిజైనర్ గా కాజల్, ఆ ఇద్దర్నీ విడదీసి మళ్లీ కలిపే పాత్రలో శ్రీహరి నటిస్తున్నారు. ఆసక్తికరంగా చిరంజీవి నటించిన 'ఘరానామొగుడు'లోని 'బంగారు కోడిపెట్ట' సాంగ్ ను ఇందులో రీమిక్స్ చేసి రామ్ చరణ్-చిరంజీవిలపై చిత్రీకరించడం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనింగ్, ఎం.ఎం.కీరవాణి సంగీతం-రీరికార్డింగ్ ఈ చిత్రానిని హైలైట్స్ కాబోతున్నాయి. ఈనెల 24న 'మగధీర' అత్యధిక ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.
SubscribeBookmark and ShareBookmark and Share





0 comments:

Post a Comment


Chat here


ShoutMix chat widget